మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (SYG) నుండి, ఆయన పుట్టినరోజు (అక్టోబర్ 15) సందర్భంగా, ‘అసుర ఆగమన’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో గ్లింప్స్ విడుదల చేయబడింది. ఈ మేరకు మేకర్స్ గ్లింప్స్‌ను ఈ ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్ (PCX) భారీ తెరపై ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆవిష్కరించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ గ్లింప్స్ గమనిస్తే, SYG ఒక డార్క్ టోన్ కలిగిన డిస్టోపియన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, ఇది ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన యాక్షన్ ప్రపంచంలోకి తీసుకెళ్తుందని తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ లుక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచారు. మొత్తానికి ‘అసుర ఆగమన’ సినిమాపై అంచనాలను బాగా పెంచేస్తోంది.
కాగా, పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రోహిత్ కె. పి దర్శకత్వం వహిస్తుండగా.. ఐశ్వర్య లక్ష్మి తేజ్ సరసన కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు, సాయి కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























