టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి ‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యువతను ఊపే మాస్ బీట్
‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా’ పాట పూర్తిగా మాస్, ఎనర్జిటిక్ బీట్తో కూడిన డ్యాన్స్ నంబర్‌గా రూపొందింది. ఇందులో సుధీర్ బాబు తన స్టైలిష్ లుక్, ఫుట్-ట్యాపింగ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాట ప్రత్యేకంగా యువతను, డ్యాన్స్ లవర్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. పాటలోని ఆకర్షణీయమైన సాహిత్యం, క్యాచీ ట్యూన్.. సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఈ పాటలో సుధీర్ బాబు వేసిన స్టెప్పులు, ఎనర్జీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతున్నాయి. రేపు ఇది థియేటర్లలో ప్రేక్షకులను ఊపేయడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో మరియు మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారింది.
ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ పాన్-ఇండియా చిత్రం నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























