రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార చాప్టర్ 1 దేశ వ్యాప్తంగా సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుంది.నిన్నటితో ఈసినిమా 650 కోట్ల క్లబ్ లో చేరి ఈఏడాది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 11 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 655కోట్ల వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ ప్రకటించారు.మరో 150 కోట్ల వసూళ్లను రాబడితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించనుంది.మరి ఫుల్ రన్ లో కాంతార చాప్టర్ 1 ఆ మార్క్ అందుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కర్ణాటకలో రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో రాంపేజ్ కొనసాగిస్తోంది.నిన్నటి వరకు అక్కడ 190 కోట్ల మార్క్ చేరుకుంది ఈవారం లో 200కోట్ల క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో 250కోట్ల వసూళ్లను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక మళయాలంలో ఈసినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. నిన్నటి తో 50కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.కెజిఎఫ్ 2 తరువాత కేరళ లో హైయెస్ట్ కన్నడ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.తమిళనాడులో కూడా 50కోట్లపైనే వసూళ్లను రాబట్టగా హిందీలో 145కోట్లు తెలుగులో 80కోట్ల వసూళ్లతో బ్రేక్ ఈవెన్ ను కు చేరువైంది.
ఓవరాల్ గా మరో 100కోట్లు రాబడితే చాలు ఈసినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకోనుంది.కాంతారకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.హోమ్ బలే ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























