యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కె ర్యాంప్.ఈ దీపావళి సందర్బంగా ఈనెల 17న థియేటర్లలోకి రానుంది. అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.సినిమాలో కొన్ని డైలాగ్స్ వల్ల ఈ సర్టిఫికెట్ ఇచ్చారు.ఇక రన్ టైం కూడా రివీల్ అయ్యింది. 2 గంటల 20 నిమిషాల నిడివి తో రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాకు ట్రైలర్ సూపర్ బజ్ తీసుకొచ్చింది.ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను డైరెక్ట్ చేయగా యుక్తి థరేజా హీరోయిన్ గా నటించింది.కామ్నా జఠ్మలానీ , నరేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా హాస్య మూవీస్ బ్యానర్ పై రాకేష్ దండా నిర్మిస్తున్నారు..
ఇక వరుస పరాజయాల తరువాత గత ఏడాది దీపావళికి క తో సాలిడ్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం.ఇక ఈ దీపావళికి కె ర్యాంప్ తో వస్తున్నాడు. మరి మరోసారి కిరణ్ కు దీపావళికి సెంటిమెంట్ కలిసొస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























