పరాశక్తి షూట్ కంప్లీట్

Parasakthi Shoot Successfully Wrapped Up

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న 25వ సినిమా పరాశక్తి. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.శ్రీ లీల కు కోలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇక ఈసినిమా నిన్నటి తో  షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.దాంతో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి చెప్పిన తేదీకే థియేటర్లలోకి తీసుకురానున్నారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.జనవరి 14న పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.అయితే పొంగల్ కు దళపతి విజయ్ జన నాయగన్ కూడా విడుదలవుతుండడంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రస్టింగ్ క్లాష్ జరుగనుంది.ఇక టాలీవుడ్ లోనూ సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తుండడంతో పరాశక్తి కి తెలుగులోకూడా భారీ పోటీ ఎదురుకానుంది. 

ఇదిలావుంటే రీసెంట్ గా మదరాసితో ప్రేక్షకులను పలకరించిన శివ కార్తికేయన్ తన 26వ సినిమా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చేయనున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.