ఓవర్సీస్‌లో దూసుకుపోతున్న కాంతారా చాప్టర్ 1

Rishab Shetty’s Kantara Chapter 1 Roars at North America Box Office

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ “కాంతార: ఎ లెజెండ్ చాప్టర్-1” ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారతదేశంలో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు విదేశాల్లో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం నార్త్ అమెరికాలో $4 మిలియన్ (రూ. 33 కోట్లకు పైగా) గ్రాస్ కలెక్షన్ సాధించి దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన ఈ మిస్టిక్ యాక్షన్ డ్రామా, రిషబ్ శెట్టి స్వయంగా కథానాయకుడిగా, దర్శకుడిగా విభిన్న మైన పాత్ర పోషించారు. దైవ భక్తి, ప్రకృతి, మనిషి సంబంధం అనే థీమ్ పై సాగే కథ ప్రేక్షకుల హృదయాలను తాకింది. శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భవ్యతతో కూడిన విజువల్స్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి.

పౌరాణిక, జానపద అంశాల నేపథ్యంలో సాగే ఈ ప్రీక్వెల్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందని, ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అయితే, సాధారణంగా నార్త్ అమెరికాలో బాలీవుడ్, పెద్ద తెలుగు చిత్రాలకు మాత్రమే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ, ‘కాంతార చాప్టర్ 1’ అందుకు భిన్నంగా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ, పాన్-ఇండియా సినిమా స్థాయిని మరింత పెంచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.