‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా యాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. డ్యూడ్ సినిమా ఒక మంచి వైబ్. ట్రైలర్లో మీరు చూసింది 10 శాతమే. ఈ సినిమా గ్యారంటీ హిట్టు. ఈ సినిమాలో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా కొత్త కథ ఇది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. రవి గారికి థాంక్యూ.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ప్రదీప్ ఈ సినిమాతో అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. ఇది హోల్సమ్ ఎంటర్టైనర్. దీపావళికి వస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను.” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























