మెగా స్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈనెలలో ఫైనల్ షెడ్యూల్ జరుగనుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా దసరా రోజున ఫస్ట్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేయగా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీసాల పిల్ల అంటూ సాగే ఈసాంగ్ ను ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ పాడగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.ఇప్పటివరకు ఈ ప్రోమో 20 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. రీల్స్ లో షాట్స్ లో తెగ వైరల్ అవుతుంది. ఓవరాల్ గా ఈ ప్రోమో సాంగ్ పై అంచనాలు భారీగా పెంచేసింది. ఫుల్ సాంగ్ త్వరలోనే రిలీజ్ కానుంది.
సంక్రాంతికి వస్తున్నాం కూడా విడుదలకు ముందు సాంగ్స్ తోనే భారీ హైప్ తెచ్చుకుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్సు కు బాగా కనెక్ట్ అయ్యాయి.ఇక మన శంకర వరప్రసాద్ గారు కూడా అదే బాటలో వెళ్తుంది. భీమ్స్ ఈసినిమా కి కూడా సూపర్ హిట్ ఆడియోను అందించనున్నాడు.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరు సరసన నయనతార నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈసినిమా థియేటర్లలోకి రానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























