కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 హిందీలో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటితో ఈసినిమా 75కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.మొదటి రోజు కంటే నాలుగు రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకొని స్టడీగా కలెక్టన్స్ ను రాబట్టుకుంటుంది.ఆదివారం ఈసినిమా దేశ వ్యాప్తంగా 23 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈవారంలో హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరనుంది.ఇక మూడేళ్ళ క్రితం వచ్చిన కాంతార హిందీలో 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్రీక్వెల్ పై భారీ హైప్ వచ్చింది. రివ్యూస్ కూడా పాజిటివ్ గా రావడంతో కాంతార చాప్టర్ 1 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 335 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే 500 కోట్లపైనే రాబట్టాల్సివుంటుంది. దీపావళి వరకు వేరే సినిమాలతో పెద్దగా పోటీ లేకపోవడం కాంతార చాప్టర్ 1కు అడ్వాంటేజ్ కానుంది.
రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందుర్ ఈసినిమాను నిర్మించారు.థియేట్రికల్ రన్ తరువాత ఈసినిమా ప్రైమ్ వీడియో లోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























