సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 దసరాకు భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ రివ్యూస్ రాబట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 335 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. ముఖ్యంగా కర్ణాటకలో ఈసినిమా దుమ్ము రేపుతోంది.నిన్న అక్కడ దాదాపు అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.ఇక వర్కింగ్ డే ఈరోజు కూడా సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది. నాలుగు రోజుల్లో అక్కడ ఈసినిమా 80కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగులో కూడా ఈసినిమా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.పవన్ కళ్యాణ్ తో ఓజీ తో పోటీని తట్టుకొని నాలుగు రోజుల్లో కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లపైనే గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్మడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది. మరో 40 కోట్లకుపైనే రాబడితే కానీ సేఫ్ అవ్వదు.మరి ఫుల్ రన్ లో ఇదే జోరు కొనసాగిస్తుందో చూడాలి.
రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























