నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఆమెకు జోడీగా కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కనిపించనున్నాడు. నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. త్వరలోనే తుది ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వెల్లడించింది చిత్ర యూనిట్. వైవిధ్యభరితమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైనట్టు తెలిపింది. ఈ మేరకు గీతా ఆర్ట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నవంబర్ 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ‘నదివే’ మరియు ‘ఏం జరుగుతోంది’ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మలయాళ సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని మరియు విద్య కొప్పినీడి నిర్మిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























