హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల స్పై థ్రిల్లర్ వార్ 2 ఆగస్టు లో విడులదై బాక్సాఫీస్ వద్ద నిరాశపరించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా 300కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది.తెలుగులో ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక వార్ 2 ఓటీటీలోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను హిందీ తోపాటు తెలుగు ,తమిళంలో ఈనెల 9 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.మరి ఈసినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వార్ కి సీక్వెల్ గా బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించగా ప్రీతమ్ సంగీతం అందించాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అదిత్య చోప్రా ఈసినిమాను నిర్మించాడు. ఎన్టీఆర్ కి హిందీలో మొదటి సినిమా.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నాడు.టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను తెరకెక్కిస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి , న్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది జూన్ 25న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























