కాంతార చాప్టర్ 1.. షూటింగ్ జరిగినన్ని రోజులూ, ఆ నియమాలు పాటించిన రిషబ్ శెట్టి

Kantara A Legend – Chapter 1 Rishab Shetty Maintained Strict Discipline During Shoot

కన్నడ స్టార్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార’ చిత్రం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ రాబోతోంది. దీనిని రిషబ్ శెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఆయన తనను తాను మలుచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుభవాల గురించి తాజాగా రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ..

ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. “‘కాంతార’ సినిమాకు పనిచేయడం కేవలం ఒక సినిమా షూటింగ్ లాంటిది కాదు, అది ఒక దీక్ష లాంటిది. . నా పాత్ర స్వభావం, దాని నేపథ్యం చాలా పవిత్రమైనవి. అందుకే, షూటింగ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు నేను చాలా నిష్టగా ఉన్నాను. నాకు నేనుగా కొన్ని నియమాలు పెట్టుకుని, వాటిని పాటించాను.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మాంసాహారం భుజించడం, ధూమపానం, మద్యపానం వంటివాటికి పూర్తి దూరంగా ఉన్నాను. ఆ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి, ఆ శక్తిని అనుభూతి చెందడానికి నేను మానసికంగా సంసిద్ధమై ఉన్నాను. ఇది నాకు నటనలో, దర్శకత్వంలో చాలా సహాయపడింది” అని తెలిపారు. ఇక గతంలో కూడా కాంతార సినిమా కోసం ఆయన అనుసరించిన సంప్రదాయ విధానాలు, ఆచారాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

పాత్రలో పవిత్రత.. చారిత్రిక అంశాలు!

‘చాప్టర్ 1’ అనేది ఆ చరిత్రకు సంబంధించిన కథ కాబట్టి, ఆయన పాత్రకు న్యాయం చేయడానికి మరింత అంకితభావంతో పనిచేసినట్లు తెలుస్తోంది. సినిమాలోని పాత్రలన్నీ చాలా లోతుగా, పవిత్రంగా ఉంటాయని, అందుకే షూటింగ్ వాతావరణాన్ని కూడా చాలా భక్తిపూర్వకంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

రిషబ్ శెట్టి వ్యక్తిగతంగా ఇంతటి నిష్ఠను పాటించడం చూస్తుంటే, ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా కూడా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన, శక్తివంతమైన అనుభూతిని ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.