పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ ప్రస్తుతం బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్లకు పైగా వసూళ్లతో పవన్ కెరీర్ లోనే ఈ ఫీట్ అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. ఈ విజయంపై టీమ్ అంతా ఫుల్ ఖుషీగా ఉంది. ఈ నేపథ్యం,లో ఇందులో కీలక పాత్ర పోషించిన నటి శ్రీయా రెడ్డి స్పందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీయా రెడ్డి ఎమోషనల్ ట్వీట్
ఈ మేరకు ప్రత్యేకంగా డైరెక్టర్ సుజీత్ గురించి శ్రీయా రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ — “గీత అనే పాత్ర ద్వారా తెరపై బలం అనేది ధైర్యంతోనే వస్తుందని సుజీత్ రాయడం నాకు గుర్తు చేసింది. ఇంత భారీ స్కేల్ సినిమాలో ఒక మహిళను uncompromised, fierce మరియు whole గా నిలబెట్టడం చాలా అరుదైన ఆత్మవిశ్వాసం ఉన్న దర్శకుడికే సాధ్యం” అని పేర్కొన్నారు.
ఇంకా ఆమె ఇలా చెప్పారు.. “గీత పాత్ర ఇచ్చినందుకు సుజీత్‌కు ధన్యవాదాలు. ఈ అనుభవం ఎప్పటికీ నాతో ఉంటుంది. నువ్వు గొప్ప మనిషివి కాబట్టే గొప్ప విషయాలు జరుగుతాయి. నీ కష్టం, నమ్మకం, త్యాగాలు నిన్ను ఈ స్థాయికి తెచ్చాయి. ఈ విజయం నీకే అర్హం” అంటూ సుజీత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























