ఓజీ సీక్వెల్‌లో అకీరా? సుజీత్ ఆన్సర్ ఇదే..!

OG Director Sujeeth Responds to Akira Nandan Casting Rumours For The Sequel

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా సీక్వెల్ గురించిన చర్చ మొదలైంది. ముఖ్యంగా, ‘ఓజీ’ సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై దర్శకుడు సుజీత్ తాజాగా స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఓజీ’ సీక్వెల్‌లో అకీరా? సుజీత్ రియాక్షన్..

ఓజీ సక్సెస్ మీట్‌లో భాగంగా దర్శకుడు సుజీత్‌ను మీడియా ఈ విషయంపై ప్రశ్నించగా, ఆయన చాలా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. “ఈ సినిమా సక్సెస్ అయింది. సీక్వెల్ ఉంటుందనేది మాత్రం పక్కా. కానీ, అకీరా గారి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. దానికి ఇంకా చాలా సమయం ఉంది. అకీరాతో మూవీ తీస్తే హ్యాపీనే కదా” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఓజీ షూటింగ్ జరుగుతున్న టైంలో అకీరా సెట్స్‌కు వచ్చారు. తనలో ఓ స్పార్క్ ఉంది. ప్రస్తుతానికి ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను. ఏది చెప్పినా అది ఎక్కడెక్కడికో వెళ్తుంది. అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడను. ఈ విషయాన్ని మీరు పవన్ కల్యాణ్‌నే అడగాలి.” అని సుజిత్ పేర్కొన్నారు.

అకీరా ఎంట్రీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు..

కాగా, అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఈ తరుణంలో, డైరెక్టర్ సుజీత్ సమాధానం అభిమానుల్లో మరిన్ని అంచనాలను పెంచింది. దీంతో పవర్ స్టార్ ఫాన్స్ దీనిపై మరింతగా ఊహాగానాలు చేస్తున్నారు. ‘ఓజీ’ సీక్వెల్ కథకు అకీరా క్యారెక్టర్ సరిగ్గా సరిపోయే అవకాశం ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

దర్శకుడు సుజిత్ సీక్వెల్‌ను ధృవీకరించడం, అకీరా గురించి స్పష్టంగా ఖండించకపోవడం చూస్తే, రాబోయే రోజుల్లో ఈ విషయంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా, ‘ఓజీ’ సీక్వెల్ వస్తుందనే వార్త ఇటు పవన్ అభిమానులకు, అటు సినీ ప్రియులకు పెద్ద పండుగలా మారింది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో రెండో భాగంపై ఇప్పటినుంచే అంచనాలు పెరుగుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.