ఓజీ టైటిల్ మాది కాదు.. కానీ అడిగిన వెంటనే ఆయన ఇచ్చేశారు – నిర్మాత దానయ్య

Producer Danayya Thanks Naga Vamsi For Giving OG Title

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీమియర్స్‌తోనే ప్రభంజనం సృష్టించి, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ అభిమానులకు దానయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఓజీ టైటిల్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

“దర్శకుడు సుజిత్ కథ చెప్పిన తర్వాత, ఈ సినిమాకు ‘ఓజీ’ (OG – Original Gangster) అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని మాకు అనిపించింది. కానీ, ఆ టైటిల్ హక్కులు వేరే నిర్మాణ సంస్థ సితార వద్ద ఉన్నాయి. దీంతో ఆ టైటిల్ కోసం ప్రయత్నించాం. మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే, నిర్మాత నాగవంశీ ఎటువంటి ఆలోచన లేకుండా, ప్రేమతో ఆ టైటిల్‌ను మాకు ఇచ్చేశారు. అందుకు ఆయనకు థ్యాంక్స్.” అని చెప్పారు దానయ్య.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.