ఓటీటీ లోకి రానున్న మదరాసి.. ఎక్కడ, ఎప్పుడంటే..?

Sivakarthikeyan Reveals OTT Platform and Release Date of Madharaasi

‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం మదరాసి. ప్రముఖ దర్శకుడు ఏఆర్. మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించగా.. విద్యుత్‌ జమ్వాల్‌ విలన్‌గా, బీజు మేనన్‌ కీలక పాత్రలో కనిపించారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లతో మంచి హిట్ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రావడానికి సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా హీరో శివకార్తికేయన్ స్వయంగా ఓటిటి రిలీజ్ డేట్‌ మరియు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాలను ప్రకటించారు. ఆయన తెలిపిన ప్రకారం, మదరాసి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. అక్టోబర్ 1వ తేదీ నుండి స్ట్రీమింగ్‌ కానుంది. మాతృక తమిళం, తెలుగు సహా ఇతర ప్రధాన భాషల్లో అందుబాటులో ఉండనుంది.

ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్. థ్రిల్లింగ్ ఎమోషన్స్, మంచి పాటలు, కుటుంబం మొత్తం కూర్చుని చూడదగ్గ కథ, సన్నివేశాలతో పాటు ఎమోషనల్ డ్రామాతో మదరాసి ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు డిజిటల్ రేసులో కూడా విజయం సాధిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.