పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మ్యానియా ఈరోజే ప్రీమియర్స్ తో స్టార్ట్ కానుంది.విడుదలకు ముందు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.ఈరోజు రాత్రి 10 గంటలనుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడనున్నాయి.అందుకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అవ్వగా దాదాపు అన్ని షోస్ సోల్డ్ అవుట్ అయ్యాయి. తెలంగాణ లో ప్రీమియర్స్ టికెట్ ధర 800 కాగా ఆంధ్రాలో 1000 రూపాయలు.అయినా కూడా పవన్ కి వున్న క్రేజ్ తో టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రీ సేల్స్ విషయంలో దుమ్ము రేపుతుంది.ప్రీమియర్స్ తో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా 70కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.దాంతో పవన్ కెరీర్ బెస్ట్ ను ఓజీ కేవలం ఓపెనింగ్స్ తో క్రాస్ చేయనుంది. దాదాపు 100 కోట్ల పైనే ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓజీ ఫుల్ రన్ లో 400కోట్లపైనే కలెక్ట్ చేయనుంది. మరి కొన్ని గంటల్లోనే రిజల్ట్ తెలిసిపోనుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడం దానికి సాంగ్స్ ,ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఓజీ పై నెక్స్ట్ లెవెల్ లో హైప్ వుంది.
సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించింది. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందించినా ఈసినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.ఓజీ ఏ సర్టిఫికెట్ తో థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























