ఓజీ థియేటర్లలో అనగనగా ఒక రాజు ప్రోమో

Anaganaga Oka Raju Promo Attached with OG Theatrical Release

మరి కొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఓజీ షోలు పడనున్నాయి.ఇప్పటికే ఈసినిమాకి నెక్స్ట్ లెవెల్లో హైప్ వుంది. కేవలం ప్రీ సేల్స్ తోనే 80 కోట్లు క్రాస్ చేసింది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మొదటి రోజే 100 కోట్ల మార్క్ దాటనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా క్రేజ్ ను వాడుకుంటున్నారు అనగనగా ఒక రాజు మేకర్స్.యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమా ఇది.ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో వుంది. సంక్రాంతికి బరిలోకి దిగనుంది.పర్ఫెక్ట్ ఫ్యామిలీ & కామెడీ డ్రామా గా తెరకెక్కుతుంది.ఇక ఓజీ ప్లే అవుతున్న థియేటర్లలో అనగనగా ఒక రాజు కొత్త ప్రోమోను ప్రదర్శించనున్నారు.సంక్రాంతి ప్రోమో పేరుతో ఈ ప్రోమో రానుంది.కేవలం థియేటర్లలో ఓజీ చూసే వారే ఈ ప్రోమోను వీక్షించవచ్చు.ఆ తరువాత డిజిటల్ రిలీజ్ చేయనున్నారు.

ప్రమోషన్స్ పరంగా అనగనగా ఒక రాజు మేకర్స్ మంచి స్టెప్ తీసుకున్నట్లే.ఓజీకి వున్న క్రేజ్ కి హిట్ టాక్ వస్తే జనాలు థియేటర్లకి రావడం ఖాయం.సో ప్రోమోతో అనగనగా ఒక రాజు కూడా జనాల్లోకి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.ఈసినిమాను మారి డైరెక్ట్ చేస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు నాగవంశీ ,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.