నారా రోహిత్ లేటెస్ట్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సుందరకాండ ఓటీటీలోకి వచ్చేసింది.గత నెలలో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమాను ఈరోజు నుండి జియో హాట్ స్టార్ట్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇందులో వృతి వాఘని,ఈశ్వర్ ఫేమ్ శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్లు గా నటించగా నరేష్,వాసుకి ఆనంద్,సత్య,అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు.కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈసినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించగా సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల,గౌతమ్ రెడ్డి,రాకేష్ మహంకాళి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుందరకాండ కథ: సిద్ధార్థ్ (నారా రోహిత్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.అతనికి దాదాపు నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోడు.దీనికి కారణం తను స్కూల్ రోజుల్లో ప్రేమించిన వైష్ణవి (శ్రీదేవి విజయ్‌కుమార్)లో ఉన్న ఐదు లక్షణాలు తనకి కాబోయే భార్యలో ఉండాలని కోరుకుంటాడు. కుటుంబం,స్నేహితులు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా సిద్ధార్థ్ తన నిర్ణయాన్ని మార్చుకోడు.ఈ క్రమంలో ఉద్యోగరీత్యా అమెరికా వెళ్తున్నప్పుడు విమానాశ్రయంలో ఐరా (వృతి వాఘాని)ని కలుస్తాడు.ఆమెలో తనకు నచ్చిన లక్షణాలు ఉండటం గమనించి, తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఐరాను ప్రేమలో పడేలా చేస్తాడు.ఐరా కూడా సిద్ధార్థ్ ప్రేమను అంగీకరిస్తుంది.కానీ, పెళ్లి గురించి మాట్లాడటానికి సిద్ధార్థ్ తన కుటుంబంతో కలిసి ఐరా ఇంటికి వెళ్లినప్పుడు ఒక ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది.అదేమిటంటే ఐరాకు, వైష్ణవికి ఒక సంబంధం ఉందని తెలుస్తుంది. ఆ తరువాత సిద్ధార్థ్ ఎదుర్కొన్న ఈ అడ్డంకులు ఏమిటి? చివరికి సిద్ధార్థ్, ఐరా పెళ్లి చేసుకుంటారా? సిద్ధార్థ్ మొదటి ప్రేమకథకు ముగింపు ఎలా పడింది? వైష్ణవి మళ్లీ అతని జీవితంలోకి ఎలా వస్తుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























