కాంతార చాప్టర్ 1 ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్

Sensational Response for Kantara Chapter 1 Trailer

కన్నడ నుండి నెక్స్ట్ వస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్ 1.మూడేళ్ళ  క్రితం వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కాంతార కు ప్రీక్వెల్ కావడంతో కాంతార చాప్టర్ 1పై భారీ అంచనాలు వున్నాయి.ఇక నిన్న ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇప్పటివరకు ఈ ట్రైలర్ 80 మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను తెచ్చుకుంది.ట్రైలర్ లో విజువల్స్ ,బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.తెలుగు ట్రైలర్ అయితే 24గంటల్లో 7 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవరాల్ గా ట్రైలర్ అయితే సినిమాకు ఉన్న హైప్ ను మరింత పెంచేసింది. ఫస్ట్ పార్ట్ 3కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయ్యి 400కోట్లకుపైనే వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈ ప్రీక్వెల్ హిట్ టాక్ వస్తే 100 కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం సాధ్యమయ్యేలానే ఉంది.

సినిమా మీద హైప్ కారణంగా అన్ని భాషల్లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1 థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.