టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిత్ర మండలి’. ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాట హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఒక సినిమాలో కొన్ని పదాలతో కామెడీగా హమ్ చేసిన ‘జంబర్ గింబర్ లాలా’ అనే పదంతో మొదలవడం విశేషం. అలాగే బ్రహ్మానందం కూడా ఈ పాటలో తళుక్కుమన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదిరిపోయే మాస్ బీట్!
ఈ పాటకు సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ అద్భుతమైన ట్యూన్‌ను అందించారు. అదితి భావరాజుతో కలిసి ధృవన్ ఆలపించారు. ఇక ఈ సాంగ్‌కి సాహిత్యాన్ని కూడా ఆయనే సమకూర్చడం విశేషం. పాట యొక్క విజువల్స్, కొరియోగ్రఫీ కూడా బాగున్నాయని అంటున్నారు. ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మాస్ బీట్, మరియు సరదా అయిన లిరిక్స్ ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక మూవీ నుండి ఇప్పటికే టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఇది సినిమాకు ఒక మంచి బూస్ట్‌ను ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.
కాగా ఫన్, మిస్టరీ జానర్‌లో తెరకెక్కుతున్న మిత్ర మండలి చిత్రంతో విజయేందర్ ఎస్ దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బన్నీ వాసు కొత్తగా నెలకొల్పిన ‘బీవీ వర్క్స్’ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి సంయిక్తంగా రూపొందిస్తున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























