మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా, సత్యన్ ఆంథికాద్ దర్శకత్వంలో రూపొందిన హృదయపూర్వం.ఓనమ్ టైంలో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.పండుగ సీజన్లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది.లోక వల్ల ఈసినిమా 100కోట్ల క్లబ్ లో జాయిన్ కాలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హృదయపూర్వం ఓటీటీలోకి వచ్చేస్తుంది.సెప్టెంబర్ 26 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.అయితే థియేటర్లలో కేవలం మలయాళం లోనే విడుదలైన ఈసినిమా ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలతో పాటు ఒరిజినల్ మలయాళంలో కూడా అందుబాటులోకి రానుంది.దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈసినిమాను ఆస్వాదించే అవకాశం దక్కనుంది.
ఈ సినిమాలో మోహన్‌లాల్, సందీప్ బాలకృష్ణన్ పాత్రలో కనిపించగా మాళవిక మోహనన్, సంగీత ప్రతాప్, సంగీత మాధవన్ నాయిర్ ముఖ్య పాత్రల్లో నటించారు. తండ్రి-కూతురు బంధాన్ని హృద్యంగా చూపించే ఈ కథలో,కుటుంబ విలువలు, భావోద్వేగాలు ప్రధానాంశాలుగా నిలుస్తాయి.ప్రేక్షకులకు హత్తుకునే కథనం, సహజమైన పాత్రల రూపకల్పన, మరియు మధురమైన సంగీతం ఈ చిత్రానికి బలం అయ్యాయి. జస్టిన్ ప్రభాకరన్ ఈసినిమాకు సంగీతం అందించగా ఆంటోనీ పెరంబవూర్ నిర్మించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































