చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ #Sharwa36 లో స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్ గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వం లో ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా వుండబోతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మేకర్స్ శర్వానంద్ పర్సనల్ స్టిల్స్‌ని విడుదల చేశారు. స్టైలీష్ మేకోవర్‌లో శర్వా లుక్స్ అదిరిపోయాయి. శర్వా ఫ్యాషన్ ట్రెండీ క్లాసీ లుక్ లో ఆకట్టుకున్నారు. యూనిక్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకునే శర్వా, ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఆడ్రినలిన్ రష్‌ని ఇచ్చే స్టంట్స్ తో అదరగొట్టబోతున్నారు. కాగా, ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.
వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ హై-ఎనర్జీ మూవీ మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ఈ చిత్రానికి జె యువరాజ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూ, ఎక్సయిటింగ్ విజువల్స్ ని అందిస్తున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి డైనమిక్ సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























