ఓజీ.. జపనీస్ సాంగ్ పాడిన పవన్ కళ్యాణ్

Power Star Pawan Kalyan Sings a Japanese Song Washi Yo Washi in OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ‘ఓజీ’ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని ఒక్కో అంశం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, చిత్ర బృందం అభిమానుల కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా ‘వాషి యో వాషి’ అనే పాటను పాడారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ స్టైల్, గంభీరమైన గొంతు ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జపనీస్ డైలాగ్‌తో అదరగొట్టిన పవన్..

‘వాషి యో వాషి’ అనేది ఒక సాధారణ పాట కాదు. పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ‘ఓజాస్ గంభీర’ అనే పాత్ర, విలన్ ‘ఓమి’కి వార్నింగ్ ఇస్తూ చెప్పే జపనీస్ డైలాగ్‌తో ఈ పాట మొదలవుతుంది. “వాషి యో వాషి, యాసెయి నో వాషి ఓ కొరోసు ని వా, మజు సుబాసా ఓ కిరీ ఓటోసు హిట్సు యూగా అరు” అంటూ పవన్ చెప్పే జపనీస్ డైలాగ్‌, దానిలోని మాస్ బీట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

పాటలోనే అసలు కథ..

ఈ పాట యొక్క అర్థం చాలా లోతుగా ఉంది. “డేగ ఓ డేగ.. వైల్డ్ ఈగల్‌ను చంపాలంటే, ముందుగా దాని రెక్కలను నరికేయాలి. అది నేలపై పడినప్పుడు మీరు దాని కళ్లు పీకేయాలి. అది గుడ్డిగా మారిన తర్వాత ఎక్కడికి వెళ్లలేదు. అప్పుడే దాని కాళ్లు నరికి కదలకుండా చేయాలి. చివరికి దాని గుండెను పీకేయాలి” అని ఈ జపనీస్ హైకూ (poem) యొక్క అర్థం అని చిత్ర బృందం తెలిపింది. ఈ కవిత్వం పవన్ కళ్యాణ్ పాత్రలోని క్రూరత్వాన్ని, సినిమాలో విలన్‌తో ఆయన పోరాటం ఎలా ఉంటుందో తెలియజేస్తోంది.

పవన్ స్వయంగా రాసిన లిరిక్స్..

ఈ జపనీస్ లిరిక్స్‌ను పవన్ కళ్యాణ్ స్వయంగా రాశారని చిత్ర బృందం ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం, పవన్ కళ్యాణ్ స్వహస్తాలతో రాసిన ఈ జపనీస్ పదాల నోట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది సినిమాపై ఆయనకు ఉన్న అంకితభావాన్ని, దర్శకుడు సుజిత్‌తో ఆయనకున్న మంచి అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ సినిమాకి ఎస్. తమన్ సంగీతం అందించారు. ఈ పాటతో తమన్ మరోసారి తన మ్యాజిక్‌ను చూపించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.