ఓజీ.. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు

Telangana Govt. Approves Special Show and Ticket Rates Hike For Pawan Kalyan’s OG

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ ఓజీ. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. మరో 5 రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేకర్స్ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీని ప్రకారం, సినిమా విడుదలకు ముందురోజు.. అంటే సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ప్రత్యేక షో నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదేవిధంగా, సినిమా విడుదలైన తర్వాత 10 రోజులు (సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు) టికెట్ ధరలు పెంచడానికి కూడా అనుమతి ఇచ్చింది.

  • ఈ ప్రత్యేక షోకు టికెట్ ధరను ₹800/- (GSTతో కలిపి)గా నిర్ణయించారు.
  • సింగిల్ స్క్రీన్స్‌లో ఒక్కో టికెట్ ధరపై ₹100/- అదనంగా వసూలు.
  • మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై ₹150/- అదనంగా వసూలు చేసుకోవచ్చు.

ఈ ఆదేశాలను తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవీ గుప్తా జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, లైసెన్సింగ్ అధికారులు మరియు పోలీస్ కమిషనర్లు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఓజీ ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని థియేటర్ల యాజమాన్యాలకు సూచించారు.

ఇక, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై ఓజీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే సినిమాపై ఉన్న భారీ అంచనాలకు తోడు, ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు కూడా తోడవడంతో ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని పవర్ స్టార్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.