పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్‌కి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సీక్వెల్‌లో హీరోయిన్ దీపికా పదుకొణే భాగం కాబోరని, తాము ఆమెతో విడిపోతున్నామని నిర్మాతలు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా వైజయంతి మూవీస్ వారు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో.. “కల్కి 2898 AD వంటి పెద్ద చిత్రానికి కట్టుబాటు, సంపూర్ణ అంకితభావం అవసరం. మొదటి భాగం కోసం మేము చాలా పెద్ద ప్రయాణం చేసినప్పటికీ, భవిష్యత్‌లో ఆ భాగస్వామ్యం కొనసాగించలేమని భావించాము. అందువల్ల దీపికా పదుకొనేతో మేము స్నేహపూర్వకంగా విడిపోతున్నాము. దీపికా భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించి శుభాకాంక్షలు” అని తెలిపారు.
ఈ అప్‌డేట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. దీపికా పదుకొణే తప్పుకున్న నేపథ్యంలో కల్కి 2898 AD సీక్వెల్‌లో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సినిమా కథ మొత్తానికి ఈ పాత్రే కీలకం కావడంతో ఇప్పుడు దీనిని ఎవరు పోషిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే, త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























