హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ విలేకరుల సమవేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రావడం ఎలా అనిపిస్తుంది?
- విజయ్ ఆంటోనీ గారు, నేను ఎప్పటినుంచో మంచి మిత్రులం.
- విజయ్ ఆంటోనీ ఫిలిం ఫ్యాక్టరీ, మా బ్యానర్ సర్వంత్ రామ్ క్రియేషన్స్ కలిపి కొన్ని మూవీస్ చేయాలని ప్రయాణం మొదలుపెట్టాం.
- ‘మార్గాన్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
- ఇప్పుడు భద్రకాళి సెప్టెంబర్ 19 రిలీజ్ కాబోతుంది.
- ఇటీవలే బూకి అనే సినిమాని మొదలుపెట్టాం.
- మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాం. అది చివరి దశకు వచ్చింది.
- మా రెండు బ్యానర్స్‌లో ఇంకొన్ని సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి.
- త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేస్తాం.
- ‘బిచ్చగాడు’ డైరెక్టర్ శశి, విజయ్ ఆంటోని గారి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్టు ఉంటుంది. తొందరలో అది అనౌన్స్ చేస్తాం.
- మేము, విజయ్ ఆంటోని గారు కలవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాము.
- మా నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి.
భద్రకాళి ఎలా మొదలైంది?
- డైరెక్టర్ అరుణ్ ప్రభు గారు కథ చెప్పారు. చాలా బాగుంది.
- డైరెక్టర్ గారు అంతకుముందు తీసిన రెండు సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి.
- భద్రకాళి సినిమాకి అరుణ్ బాబు గారు ఒక బ్యాక్ బోన్.
- ఈ సినిమాలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ప్రేక్షకులను ఆలోచింపచేసే అంశాలు కూడా ఉన్నాయి.
- సినిమా అంత అద్భుతానికి రావడానికి కారణం డైరెక్టర్ గారి విజన్.
- సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది విజయ్ ఆంటోనీ గారికి 25వ సినిమా అవ్వడం కూడా కలిసి వచ్చింది.
- మంచి బడ్జెట్, అద్భుతమైన కంటెంట్‌తో వస్తున్న సినిమా ఇది.
- తమిళ్ తెలుగు, కన్నడ, హిందీలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం.
- సినిమాకి ‘భద్రకాళి’ అనే టైటిల్ పెట్టాము.
- సరిగ్గా దసరా నవరాత్రులు సమయంలోనే ఈ సినిమా రావడం కలిసి వచ్చిందని ‘మార్గాన్’ సినిమాని రిలీజ్ చేసిన మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు.
- మార్గాన్ కంటే ఈ సినిమాకి 20% థియేటర్స్ పెరిగే అవకాశం ఉందని కూడా అన్నారు.
- వారు ఆ మాట చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ట్రైలర్ చూస్తే ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అనిపిస్తుంది? కథ ఎంత డిఫరెంట్‌గా ఉంటుంది?
- పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి.
- కానీ ఈ సినిమాలో హీరో గారు చేసిన క్యారెక్టర్‌తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు.
- చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి హీరో క్యారెక్టర్‌తో ఇప్పటివరకు సినిమా రాలేదు.
- సినిమాలో చాలా మంచి స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆడియన్స్‌కి డెఫినెట్‌గా కనెక్ట్ అవుతాయి.
- సమాజంలో జరుగుతున్న విషయాల్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. అందరూ పర్సనల్‌గా కనెక్ట్ అవుతారు.
ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏమిటి?
- చాలా ఆనందంగా అనిపించింది. మేము ఊహించిందని కంటే సినిమా అద్భుతంగా వచ్చింది.
- సినిమా మొదలైన రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు.
- విజయ్ గారి క్యారెక్టర్స్ అన్నీ నేచురల్‌గా ఉంటాయి.
- ఇందులో కూడా తన పాత్ర ఆడియన్స్‌కి చాలా కనెక్ట్ అవుతుంది.
- పెద్ద బడ్జెట్‌తో తీసిన సినిమా ఇది.
- డైరెక్టర్ గారి విజన్‌కి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేశాం.
- డైరెక్టర్ గారికి క్రియేటివ్‌గా ఫ్రీడమ్ ఇచ్చాము.
భద్రకాళిలో హైలెట్స్ గా ఉండే ఎలిమెంట్స్ ఏమిటి?
- చాలా గ్రిప్ ఉన్న స్టోరీ ఇది. ఇందులో ప్రతి సీన్ ఆడియన్స్‌ని హత్తుకుంటుంది.
- స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు.
- విజయ్ ఆంటోని గారు ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
- సాంగ్స్ కి చాలా మంచి రీచ్ వచ్చింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
వరుసగా సినిమాలు చేయడానికి మార్గన్ విజయం మీకు జోష్ ఇచ్చిందా?
- ‘మార్గాన్’కి ముందు దాదాపు 11 సినిమాలు చేశాను.
- తమిళ్‌లో చాలా పెద్ద లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ చేశాం.
- అయితే కోవిడ్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది.
- తర్వాత విజయ్ ఆంటోనీ గారితో రీ కనెక్ట్ అవడంతో మళ్లీ సినిమాల వరుసగా చేయాలని ప్లాన్ చేశాం.
తెలుగులో చేస్తున్న సినిమాలు ఉన్నాయా?
- తెలుగులో సత్యదేవ్ గారితో ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా చేస్తున్నాం.
- అది కంప్లీట్ అయి రెడీగా ఉంది. నవంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























