ఓజీ నుండి ‘గన్స్ N రోజెస్’ సాంగ్ రిలీజ్

Guns N Roses Song Drops From Power Star Pawan Kalyan’s OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర యూనిట్ పవర్ స్టార్ అభిమానులకు మ్యూజికల్ ఫీస్ట్ అందించింది. ‘గన్స్ అండ్ రోజెస్’ అనే సాంగ్‌ని విడుదల చేశారు. 4:14 నిమిషాల నిడివి కలిగిన ఈ సొంగ్ తమన్ పవర్‌ఫుల్ బీట్‌, ఎలక్ట్రిక్ మ్యూజిక్, ఎనర్జిటిక్ వోకల్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పాటలో పవన్ కళ్యాణ్ పాత్ర శక్తివంతమైన యాక్షన్ అవతారం స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. సినిమాలో ఆయన స్టైల్, ఆరా, పవర్ అన్నీ ఈ లిరిక్స్‌లో మిళితమై, ఆయనకు ఉన్న ప్రత్యేకమైన ఇమేజ్‌ను మరోసారి హైలైట్ చేశాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీప్రేక్షకులందరికీ ఈ సాంగ్ బ్లాక్‌బస్టర్ వైబ్స్ ఇచ్చింది. దీంతో ఈ పాట వస్తూనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తించగా, ఈ సాంగ్ ఆ హైప్‌ను మరింతగా పెంచింది. థియేటర్లలో ‘ఓజీ’ చూసే సమయానికి ఎలాంటి మాస్ ఫెస్ట్ వేటింగ్‌లో ఉందో ఈ పాట స్పష్టతనిస్తోంది. మ్యూజిక్ లవర్స్ నుండి పవర్ స్టార్ అభిమానుల వరకు అందరూ ఈ సాంగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సాంగ్ మాత్రం సినిమా హిట్ అయ్యే సంకేతాన్ని ముందుగానే ఇచ్చేసింది. అన్నీ అనుకున్నట్లే సాగితే, ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం ఖాయం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు ఎమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.