ఇండస్ట్రీ హిట్ దిశగా లోక 

Lokah on Track to Become an Industry Hit

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీ హిట్ గా దూసుకుపోతుంది మలయాళ మూవీ లోకః చాప్టర్ 1 – చంద్ర.6కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈసినిమా రాంపేజ్ ఈరోజు తో 250కోట్లకు చేరుకుంది.3 వారంలో కూడా ఎక్కడా స్లో అవ్వకుండా అదరగొడుతుంది.నిన్న కేరళలో ఈసినిమా 5 కోట్లకుపైనే రాబట్టుకుంది. దాంతో 18 రోజుల్లో 88కోట్ల వసూళ్లతో ఆల్ టైం టాప్ 2 గ్రాసర్ గా రికార్డు సృష్టిచింది.ఫుల్ రన్ లో తుడరమ్ (118కోట్లు) బ్రేక్ చేస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఓవర్సీస్ లో నిన్నటి తో 100 కోట్లకుపైనే రాబట్టింది.అలాగే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10కోట్ల వరకు రాబట్టుకుంది. ఓవరాల్ గా 18రోజుల్లో ఈసినిమా 248కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.వచ్చే వారంలో ఇండస్ట్రీ హిట్ ఎల్ 2 :ఎంపురాన్ (269కోట్లు) వసూళ్లను క్రాస్ చేసి చరిత్ర సృష్టించనుంది.ఇప్పటికే బుక్ మై షోలో హైయెస్ట్ టికెట్స్ సేల్స్ జరిగిన మలయాళ మూవీగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఇక థియేటర్లలో ఈసినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఓటీటీ రైట్స్ కోసం ఫుల్ డిమాండ్ వుంది.జియో హాట్ స్టార్ ఈహక్కులను దక్కించుకొనే ఛాన్స్ వుంది.

దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది.మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ వేఫెరర్ ఈసినిమాను నిర్మించగా కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించింది.సూపర్ హీరో కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ తెరకెక్కించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.