2000 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. అప్పట్లో దాదాపు మూడు, నాలుగు రాష్ట్రాలను వణికించిన ప్రముఖ స్మగ్లర్ వీరప్పన్ కన్నడ ‘కంఠీరవ’ రాజ్ కుమార్‌ని కిడ్నాప్ చేసిన (108 రోజులపాటు) కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. దీనికి తెలుగు దర్శకుడు కట్ట శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ హిస్టారికల్ మూవీలో ‘కంఠీరవ’ రాజ్ కుమార్, వీరప్పన్ కిడ్నాప్ కథాంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించడం జరుగుతుంది. అప్పటి కిడ్నాప్ కోణంలో పలు అంశాలను ఈ చిత్రంలో చర్చించడం జరుగుతుంది. పూర్తి వివరాలు దసరా పండుగ తర్వాత వెల్లడిస్తాం” అని తెలిపారు.
ఇక ఈ చిత్రానికి ప్రతిభగల టెక్నీషియన్లు పని చేయనున్నారు. కాల భైరవ క్రియేషన్స్ శ్రీ విఘ్నేశ్వర చిత్రాలయ పతాకంపై వి. లీల మనోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అశోక్, ముని, నాగేష్ ప్రధాన పాత్రధారులుగా నటించనున్నారు. కాగా ఈ సినిమాకి బి అనయ్య కథను అందిస్తుండగా.. అర్జున్ జన్య సంగీతం, కె. మనోహర్ కెమెరా నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























