దక్షిణాదిలో సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వరుస బ్లాక్ బస్టర్లతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది మలయాళ నటి సాయి పల్లవి.ఇక ఈ హీరోయిన్ హిందీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సాయి పల్లవి ప్రేమ కథా నేపథ్యం లో ఓ సినిమా చేస్తుంది.ఈసినిమాతోనే బాలీవుడ్ లో అడుగుపెడుతుంది.ఇందులో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కు హీరోగా నటిస్తున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా టైటిల్ & రిలీజ్ డేట్ మార్చారు. ఇంతకుముందు ఏక్ దిన్ అనే టైటిల్ ను ఖరారు చేయగా నవంబర్ 7న రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈసినిమాకు మేరే రహో అనే టైటిల్ ఫిక్స్ చేసి డిసెంబర్ 12న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.సునీల్ పాండే డైరెక్ట్ చేస్తుండగా అమీర్ ఖాన్ ,మన్సూర్ ఖాన్ కలిసి ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈసినిమా కాకుండా సాయి పల్లవి ,ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రామాయణ లో కూడా నటిస్తుంది.ఇందులో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా రణబీర్ కపూర్ , రాముడిగా ,కన్నడ స్టార్ యష్ రావణాసురిడి గా కనిపించనున్నాడు.రీసెంట్ గా గ్లింప్స్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.రామాయణ రెండు పార్టులుగా రిలీజ్ కానుంది.అందులో మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























