ఓటీటీలోకి వచ్చేసిన కూలీ

coolie now streaming on prime video

సూపర్ స్టార్ రజినీకాంత్ -టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూలీ.విడుదలకు ముందు ఈసినిమా ఓ రేంజ్ హైప్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రాగా రివ్యూస్ తో సంబంధం లేకుండా మొదటి రోజే 151 కోట్ల గ్రాస్ వసూళ్లతో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది.ఆ తరువాత కొద్దీ రోజులు అదే జోరు కొనసాగించినప్పటికీ సాలిడ్ లాంగ్ రన్ ను కంటిన్యూ చేయలేకపోయింది.దాంతో రిలీజ్ కు ముందు 1000కోట్లు కొడుతుందనుకున్న కూలీ 500 కోట్ల దగ్గర ఆగిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా 28 రోజుల థియేట్రికల్ రన్ తరువాత ఈరోజు ఓటీటీలోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు గాను స్ట్రీమింగ్ రైట్స్ ను తీసుకోగా ఈరోజు నుండి అన్ని దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.హిందీ వెర్షన్ ను ఆలస్యంగా స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.మరి ఓటీటీలో కూలీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమాలో కింగ్ నాగార్జున విలన్‌గా నటించగా సౌబిన్ షాహిర్ ,ఉపేంద్ర,సత్యరాజ్,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరిశాడు.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.