కిష్కింధపురి లాంటి హారర్ సినిమా ఇప్పటివరకు రాలేదు – హీరో సాయి శ్రీనివాస్

bellamkonda sai sreenivas talks about kishnkindhapuri

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి.అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫస్ట్ టై హారర్ సినిమా చేయడం ఎలా అనిపించింది?
నేను ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ క్రమంలో చాలా వరకూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే నాకు పర్సనల్ గా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చాలా ఇష్టం.డైరెక్టర్ కౌశిక్ కలిసినప్పుడు కూడా మేము ఇదే మాట్లాడుకున్నాం. అప్పుడు కిష్కింధపురి కథ చెప్పారు. చాలా నచ్చింది. నిజంగా నాకు బాగా ఇష్టమైన జానర్ ఇది. ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చేసాం.  

నిన్న ఫస్ట్ టైం థియేటర్స్ లో చూసాం. సినిమా అదిరిపోయింది. ముఖ్యంగా  సౌండ్. సలార్ యానిమల్ కాంతారా సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ గారు సౌండ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్ డిజైన్ చేసే స్పేస్ ఉంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. టెక్నికల్ అద్భుతంగా ప్రజెంట్ చేశాం.థ్రిల్లర్ జానర్ లో చేసిన రాక్షసుడుకి చాలా మంచి అప్లోజ్ వచ్చింది. మహిళ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకి గొప్ప ఆదరణ లభించింది.

చాలా రోజుల తర్వాత  కిష్కింధపురి తో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఖచ్చితంగా కిష్కింధపురి’ ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ థ్రిల్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.

నిర్మాత సాహు గారి  గురించి?
దర్శకుడు కౌశిక్ కు మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ సాహు గారు  ఆడియన్స్ కి ద బెస్ట్ ఇవ్వాలని టెక్నికల్ గా గ్రాఫిక్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఇచ్చారు.ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఉంది. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా చేసిన సినిమా ఇది.  

సినిమాలో యాక్షన్ ఎలా ఉంటుంది?
ఈ సినిమా కథలోనే యాక్షన్ ఉంది. మొత్తం ఆర్గానిక్ గా చేసిన సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ పరంగా ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు.హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడో చూడలేదు.హారర్ మిస్టరీ రెండు బ్లెండ్ అయిన సినిమా ఇది. ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.అనుపమ పెర్ఫార్మెన్స్ కొత్తగా వుంటుంది.నిజానికి అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా టఫ్.

నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. మా ప్రొడక్షన్ లో చేసిన కాంచన లాంటి సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను. టీనేజ్ లో ఉన్నప్పుడు కూడా హారర్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాని టీనేజ్ ఆడియన్స్  కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. హారర్ కారణంగా సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలం అయిందని సెన్సార్ సభ్యులు చెప్పడం ఆనందాన్నిచ్చింది.ఇలాంటి సినిమాలు అందరూ కలిసి ప్యాక్డ్ థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ లో ఉంటుంది.  

ఈ సినిమా కోసం ఒక వింటేజ్ రేడియో సెట్ వేశారు కదా? ఈ సినిమా కోసం సువర్ణమాయ రేడియో స్టేషన్ ని సెట్ గా వేశాం. అలాగే రియల్ వాంటెడ్ హౌస్ లో షూట్ చేశాం. అది రియల్ గా పాతబడిపోయిన బిల్డింగు. తర్వాత వాళ్లకి కొత్త బిల్డింగ్ వేసి ఇవ్వడం జరిగింది.  

మీరు ఒక సినిమాని ఓకే చేయాలంటే ఏం చూస్తారు? ముందుగా కంటెంట్ చూస్తాను. ఈ మధ్య ఏదైనా ఒక కొత్తగా చేయాలి, యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది. ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు సెట్లో లొకేషన్ లో ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను.

కొత్త సినిమాలు గురించి? టైసన్ నాయుడు షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హైందవ షూటింగ్ చివరి దశకు వచ్చింది. సమ్మె కారణంగా బ్రేక్ పడింది కానీ ఈపాటికి షూటింగ్ అయిపోయేది. ఈ రెండు కూడా డిఫరెంట్ సినిమాలు. అలాగే పొలిమేర డైరెక్టర్ అనిల్ తో ఒక సినిమా ఉండబోతుంది. అది న్యూ ఏజ్ థ్రిల్లర్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.