హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ తృప్తి రవీంద్ర, రియా జిత్తు విలేకరుల సమవేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. హీరోయిన్ తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. “మాది మహారాష్ట్ర. తమిళ్లో హీరోయిన్గా ఇది నా ఫస్ట్ సినిమా. సినిమాల్లోకి రాకముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశాను. ఇంజనీరింగ్ సమయంలోనే నాకు సినిమా పట్ల చాలా ఆసక్తి ఉండేది. థియేటర్స్ ప్లేస్ కోసం ఆడిషన్స్ ఇచ్చాను.”
“కెమెరా ముందు నటించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. కొన్ని టీవీ కమర్షియల్స్ కూడా చేశాను. అరుణ్ గారి డైరెక్షన్ టీం నుంచి ఈ సినిమా కోసం ఆడిషన్ కాల్ వచ్చింది. తర్వాత అడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ కోసం ఓకే చేశారు. ఈ సినిమాలో చాలా రిలేటబుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా క్యారెక్టర్ డిజైన్ చేశారు.”
“ఈ సినిమా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. విజయ్ గారితో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ అందరు చాలా సపోర్ట్ చేశారు. తెలుగు ఆడియన్స్ అన్ని రకాల సినిమాల్ని గొప్పగా ఆదరిస్తారు. సినిమాని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సినిమా కూడా ఆడియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























