హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ తృప్తి రవీంద్ర, రియా జిత్తు విలేకరుల సమవేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన రియా జిత్తు మాట్లాడుతూ.. “నేను మలయాళీ. తమిళ్, మలయాళీ సినిమాలు చూస్తూ పెరిగాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా నాకు అనుభవం ఉంది. దాదాపు 15 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకొని చదువుపై దృష్టి పెట్టాను. చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.”
“విజయ్ ఆంటోనీ గారి 25వ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మ్యూజిక్ వింటూ పెరిగాను. ఆయన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. విజయ్ గారు చాలా హంబుల్ పర్సన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.”
“డైరెక్టర్ అరుణ్ గారు చాలా క్లారిటీ ఉన్న మేకర్. మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇది చాలా ఇంపాక్ట్ ఫుల్ కథ. ఇలాంటి కథ సొసైటీ కి చాలా అవసరం. తప్పకుండా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ మంచి సినిమాలని ఆదరిస్తారు. భద్రకాళి కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న సినిమా. తప్పకుండా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























