గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు మరో అరుదైన, చారిత్రక గౌరవాన్ని అందుకున్నారు. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) అధికారులు ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపి, ప్రతిరోజు మార్కెట్ ప్రారంభానికి సూచికగా ఉండే ఆచారబద్ధమైన బెల్‌ను మోగించాల్సిందిగా కోరారు. ఇక వారి కోరిక మేరకు బాలయ్య NSE బెల్‌ను లాంఛనంగా మోగించారు. ఈ అరుదైన గౌరవంతో, బాలకృష్ణ గారు మరోసారి తన అశేష అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాకుండా ఈ అరుదైన ఘనతను సాధించిన తొలి దక్షిణాది నటుడిగా బాలకృష్ణ గారు చరిత్ర సృష్టించారు. కాగా, ఒక స్టార్ హీరో, ముఖ్యంగా సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తికి ఈ గౌరవం దక్కడం ఆయన వ్యక్తిత్వానికి, మరియు స్టార్‌డమ్‌కు నిదర్శనం. ఇది కేవలం ఆయనకు దక్కిన గౌరవం మాత్రమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకు మరియు మొత్తం దక్షిణాది సినిమా రంగానికి లభించిన గుర్తింపు.
ఇక ఈ చారిత్రక ఘట్టం దేశవ్యాప్తంగా అభిమానులకు ఒక గొప్ప గర్వకారణంగా మారింది. బాలయ్య తన అద్భుతమైన నటనతో, మరియు అంకితభావంతో దేశంలోని అత్యున్నత వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. ఎన్ఎస్ఈ లాంటి అంతర్జాతీయ సంస్థలో ఆయనకు దక్కిన ఈ గౌరవం, ఆయన ప్రభావం కేవలం సినిమాలకే పరిమితం కాదని, అది ఆర్థిక మరియు సామాజిక రంగాలకు కూడా విస్తరించిందని తెలియజేస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























