కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ,మరో సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కలిసి నటించనున్నారని రీసెంట్ గా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే అధికారికంగా ఈ కాంబో పై ఎలాంటి ప్రకటన రాలేదు కానీ తాజాగా కమల్ హాసన్ ఈసినిమాను కన్ఫర్మ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సైమా 2025లో భాగంగా కల్కి 2898 ఏడి కి ఉత్తమ విలన్ గా అవార్డు అందుకున్న కమల్ నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి స్పందించారు.రజినీకాంత్ ,నేను కలిసి ఎప్పుడో సినిమా చేయాలి కానీ కుదరలేదు.ఇక ఎట్టకేలకు మా కాంబినేషన్ లో సినిమా రానుందని కమల్ వెల్లడించారు.సన్ పిక్చర్స్ అలాగే రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశం ఉందని టాక్.
ప్రస్తుతం లోకేష్ స్క్రిప్ట్ పూర్తీ చేసే పనిలో వున్నాడు. కూలీ తరువాత నిజానికి ఖైదీ 2 చేయాల్సివుంది కానీ లోకేష్ ఆ సినిమాను పక్కన పెట్టి రజినీ కమల్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడు.ఇప్పటికే కమల్ హాసన్‌తో విక్రమ్ అనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన లోకేష్ రజినీకాంత్ తో కూలీ చేశాడు.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా 500కోట్ల వసూళ్లను రాబట్టి యావరేజ్ అనిపించుకుంది.ఇక ఈసారి ఇద్దరిని ఓకే సినిమాలో స్క్రీన్ మీద చూపించనున్నాడు లోకేష్.ఈసినిమా కోలీవుడ్ 1000కోట్ల సినిమా అవుతుందని తమిళ సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























