డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈనెలలో ఈ షూట్ కంప్లీట్ కానుంది.ఇక ఈసినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇక సెకండ్ సింగిల్ కూడా రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పప్పీ షేమ్ అంటూ ఈసాగే ఈసాంగ్ ఈనెల 8న రిలీజ్ కానుంది.ఈపాట ను రామ్ పాడడం విశేషం.అందులో భాగంగా ఈరోజు ఈసాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.సాంగ్ విషయానికి వస్తే లిరిక్స్ క్యాచీ గా ఉండగా బీట్స్ అదిరిపోయాయి.ఓవరాల్ గా ప్రోమో చూస్తుంటే సెకండ్ సింగిల్ కూడా చార్ట్ బస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.భాస్కర బట్ల ఈసాంగ్ రచించారు.ఈ టీజ్ సాంగ్ లో రామ్ ఎనర్జిటిక్ స్టెప్స్ హైలైట్ అవ్వనున్నాయి.
మహేష్ బాబు.పి డైరెక్షన్ లో హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో నటిస్తుండగా తనకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు.ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28 న ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























