#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్.యువ హీరోయిన్ శివాని నాగరం ఇందులో మౌళికి జంటగా నటించింది. ప్రమోషన్స్ తో బాగానే జనాల్లోకి వెళ్ళింది ఈసినిమా.ఇక నిన్న ఈసినిమా థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది.దాంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.లిమిటెడ్ స్క్రీన్ లలో విడుదలైన ఈసినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుంది.దాంతో తొలి రోజే టార్గెట్ ను పూర్తి చేసి హ్యుజ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.అటు ఓవర్సీస్ లో 100K మార్క్ దాటింది.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 1మిలియన్ డాలర్ మార్క్ చేరుకునేలా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి మేకర్స్ ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్ , వంశీ నందిపాటి సినిమాను చూసి కంటెంట్ నచ్చడంతో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు.అలా థియేటర్లోకి వచ్చిన ఈసినిమా ఇప్పుడు రాంపేజ్ కొనసాగిస్తోంది.మొదటి రోజు కన్నా రెండో రోజు ఈసినిమా ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.ఫుల్ రన్ లో బయ్యర్లకు భారీ లాభాలను అందించనుంది.
యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా సాయి మార్తాండ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా రాజీవ్ కనకాల ఇందులో కీలక పాత్రలో నటించాడు. #90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈసినిమాను నిర్మించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























