హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో మలయాళంలో తెరకెక్కిన సినిమా లోకః చాప్టర్ 1 – చంద్ర. విడుదలైన రోజు యావరేజ్ కలెక్షన్స్ ను రాబట్టిన ఈసినిమా నెక్స్ట్ డే నుండి ఊహించని విధంగా రాంపేజ్ కొనసాగిస్తూ దూసుకుపోతుంది.నిన్న 9వ రోజు బుక్ మై షోలో 4 లక్ష్లలకు పైగా టికెట్స్ తెగాయి అంటే ఏ రేంజ్ లో విధ్వసం సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కేరళలో 9 రోజుల్లో ఈసినిమా 48కోట్ల పైనే వసూళ్లను రాబట్టగా ఈరోజుతో 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో ఈసినిమా 140 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. రేపటితో 200 కోట్లకు చేరువకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కేవలం మలయాళం లోనేకాదు తెలుగులోనూ అదరగొడుతుంది. తెలుగులో కొత్త లోక గా విడుదలకాగా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఈసినిమాను తక్కువ ధరకు తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేయగా లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 8 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాత గా వ్యవహరించిన ఈసినిమాను డొమినిక్ అరుణ్ తెరకెక్కించాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























