కిష్కింధపురి నుండి సెంటిమెంట్ సాంగ్‌ రిలీజ్

Team Kishkindhapuri Released Needhi Naadhi O Chiru Lokam Song

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి కొత్త పాటను మేకర్స్ విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమ్మ-కొడుకు అనుబంధానికి అంకితం..!

“నీది నాది ఓ చిన్న లోకం” అంటూ సాగే ఈ పాట తల్లీ–కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంది. ప్రతి ఇంట్లో తల్లి-కొడుకు మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమను తెలిపేలా, మనసుకు హత్తుకునేలా ఈ సాంగ్‌ను తెరకెక్కించారు. ఈ పాటతో ‘కిష్కింధపురి’ చిత్రం యాక్షన్ మరియు ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుందని స్పష్టమైంది.

చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం హృదయానికి హత్తుకునే విధంగా ఉంది. పూర్ణాచారి భావోద్వేగభరితమైన సాహిత్యం ప్రేక్షకులను తమ తల్లులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేలా చేస్తుంది. అలాగే ఎస్పీ చరణ్ అద్భుత గాత్రం పాటకు ప్రాణం పోసింది. ఇది కేవలం ఒక పాట కాదు, ప్రతి కొడుకు తన తల్లికి చెప్పాలనుకునే మనసులోని మాటగా నిలిచిపోతుంది. ఇక ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడగా, ఈ పాట మరింత పాజిటివ్ బజ్‌ను పెంచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.