కన్నడలో ఘన విజయం సాధించి, తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందిన లేటెస్ట్ హరర్ కామెడీ సినిమా ‘సు ఫ్రమ్ సో’ ఇప్పుడు OTTలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త అందిస్తూ, స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసింది చిత్ర యూనిట్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా-హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులో ఉండనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ఒక సాధారణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, కథ, కథనం, నటన, మరియు భయపెడుతూ నవ్వించే కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించి, అక్కడ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను, తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డబ్ చేసి విడుదల చేసింది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో, థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారు కూడా ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
థియేటర్ల రన్ ముగిసిన తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాల జాబితాలో ‘సు ఫ్రమ్ సో’ చేరిపోయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ సినిమా దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది సంచలనంగా నిలిచింది. పల్లెటూరి నేపథ్యం, స్వచ్ఛమైన హాస్యం, మరియు ప్రేమ కథతో ఈ చిత్రం డిజిటల్ వేదికపై కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. సెప్టెంబర్ 9 నుండి ఈ సినిమాను కుటుంబంతో కలిసి ఇంట్లోనే చూసి ఆస్వాదించవచ్చు.
‘సు ఫ్రమ్ సో’ కథ ఏంటంటే..?
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలి సమీపంలోని ఓ గ్రామంలో నివసించే అశోక్ (జె.పి. తుమినాడ్) ఒక పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి వస్తూ తన ప్రియురాలి ఇంటి దగ్గర ఆగుతాడు. ఆ సమయంలో ఆమె బాత్‌రూమ్ నుంచి ఏవో మాటలు వినిపించడంతో, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దొంగచాటుగా ఆమెను చూసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, అనుకోకుండా అతడిని ఇద్దరు వ్యక్తులు చూసి చూస్తారు. పట్టుబడడంతో, తప్పించుకోవడానికి దయ్యం పట్టినట్లుగా డ్రామా చేస్తాడు.
అయితే తెల్లవారేసరికి అశోక్‌కు దయ్యం పట్టిందని ఊరిలో పుకారు వ్యాపించిపోతుంది. దీంతో, అశోక్‌లోని దయ్యాన్ని వదిలించేందుకు గ్రామానికి చెందిన పెద్ద రవన్న (షానిల్ గౌతమ్), నగరంలో ఉన్న స్వామీజీ కరుణాజీ (రాజ్ బి శెట్టి)ని పిలిపిస్తాడు. ఇంతకూ అశోక్‌కు నిజంగానే దయ్యం పట్టిందా? కరుణాజీ స్వామీజీ దయ్యాన్ని వదిలించారా? అశోక్ చేసిన డ్రామా వల్ల ఆ ఊరి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























