ధనుష్ ఇడ్లీ కడై తెలుగులో ఇడ్లీ కొట్టు గా

Dhanush’s Idli Kadai Titled as Idli Kottu in Telugu

వరుసగా సినిమాలు చేస్తూ అంత్యంత బిజీగా వుండే హీరోల్లో తమిళ హీరో ధనుష్ ఒకరు.ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు ఈహీరో.రీసెంట్ గా ధనుష్ కుబేరతో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టగా ఇక నెక్స్ట్ మరో సినిమాతో రెడీ రావడానికి అవుతున్నాడు.అందులో భాగంగా ఇడ్లీ కడైతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.ఈసినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాదు డైరెక్షన్ కూడా చేశాడు.ఇందులో నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ విజయ్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక ఈసినిమా తెలుగులో కూడా విడుదలకానుంది.తెలుగులో ఈసినిమాను శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ ఇడ్లీ కొట్టు అనే టైటిల్ తో విడుదలచేస్తుంది.అక్టోబర్ 1న థియేటర్లలోకి రానుంది.అయితే ఈసినిమాకు ఒక్క రోజు గ్యాప్ తో కాంతార చాప్టర్ 1 రిలీజ్ కానుంది.ఈసినిమాకు భారీ హైప్ వుంది.దాంతో ఇడ్లీ కొట్టుకు భారీ పోటీ ఎదురుకానుంది.జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వుండర్బార్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.

ఇక రీసెంట్ గా తేరే ఇష్క్ మే అనే హిందీ సినిమాను కూడా పూర్తి చేసిన ధనుష్ నెక్స్ట్ విగ్నేష్ రాజా డైరెక్షన్ లో సినిమా చేయనుకున్నాడు.ఈసినిమా కోసం పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ఈసినిమాను నిర్మించనుంది. కేవలం 90 రోజుల్లో ఈసినిమా పూర్తి చేయనున్నారట.ఇక ఈ సినిమా కాకుండా ధనుష్ లైనప్ లో చాలా సినిమాలే వున్నాయి.అందులో అబ్దుల్ కలాం ,ఇళయరాజా బయోపిక్ లు కూడా చేయాల్సివుంది.

ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : :point_down:
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్
 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.