భైరవం తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి తో రానున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించింది.రాక్షసుడు తరువాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రమిది.ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది.ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.ఈ ఈవెంట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.మీ అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది.హారర్ నాకు ఇష్టమైన జానర్. డైరెక్టర్ కౌశిక్ ఈ సినిమా కథ చెప్పిన వెంటనే నాకు నచ్చింది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కౌశిక్ కి థాంక్యూ.తను చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సాయి గారితో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉంది.
సాయితో కలిసి చేసిన రాక్షసుడు మాకు వెరీ మెమొరబుల్ ఫిలిం. మళ్లీ చాలా రోజుల తర్వాత సాయితో ఇలాంటి డిఫరెంట్ సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది.సినిమాలో పనిచేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.సెప్టెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అందరూ థియేటర్స్ కి వచ్చి చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























