యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర కాంబోలో వస్తున్న సినిమా టైసన్ నాయుడు.గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈసినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు.నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఆలస్యమవుతూ వస్తుంది. ఈసినిమా స్టార్ట్ అయ్యాక బెల్లంకొండ రెండు సినిమాలు ఫినిష్ చేశాడు. అందులో ఒకటి రిలీజ్ కూడా అయ్యింది.కానీ టైసన్ నాయుడు మాత్రం ముందుకు కదల్లేదు. అప్పుడెప్పుడో ఈసినిమానుండి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు అంతే.అయితే ఈసినిమా గురించి ఎట్టకేలకు ఓ అప్డేట్ ఇచ్చాడు సాయి శ్రీనివాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టైసన్ నాయుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుందని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని కిష్కింధపురి ఈవెంట్ లో అన్నాడు.సో టైసన్ నాయుడు రిలీజ్ కావడం పక్కా.ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.ఇక ఈనెల 12న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురితో రానున్నాడు.హారర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా కౌశిక్ పెగాళ్ళపాటి డైరెక్ట్ చేశాడు.
ఇక ప్రస్తుతం సాయి శ్రీనివాస్ హైందవ అనే సినిమా కూడా చేస్తున్నాడు.లుదీర్ బైరెడ్డి, మహేష్ చందు డైరెక్ట్ చేస్తుండగా మూన్ షైన్ స్క్రీన్ నిర్మిస్తుంది.లియోన్ జేమ్స్ అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























