`అన్నమయ్య`… కింగ్ నాగార్జున కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమా తరువాత మళ్ళీ నాగ్ ఖాతాలో సాలిడ్ హిట్ పడేసరికి మూడేళ్ళు పట్టింది. `నువ్వు వస్తావని` రూపంలో మళ్ళీ నాగ్‌కి మరో మరపురాని విజయం దక్కింది. 2000 ఏప్రిల్ 5న ఆ సినిమా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కట్ చేస్తే… `రారండోయ్ వేడుక చూద్దాం` తరువాత ఆయన తనయుడు, యువ సామ్రాట్ నాగచైతన్య పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. `యుద్ధం శరణం`, `శైలజా రెడ్డి అల్లుడు`, `సవ్యసాచి`… ఇలా వరుసగా చైతూని పరాజయాలు పలకరించాయి. ఈ నేపథ్యంలో… అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `మజిలీ`పైనే అక్కినేని అభిమానుల ఆశలన్నీ.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… 19 ఏళ్ళ క్రితం `నువ్వు వస్తావని` విడుదలైన ఏప్రిల్ 5వ తేదినే టార్గెట్ చేసుకుని ఇప్పుడు `మజిలీ` కూడా రాబోతోంది. హిట్ పెయిర్, తన శ్రీమతి సమంత సమేతంగా రానున్న చైతూకి `మజిలీ` రూపంలో మరో విజయం దక్కుతుందేమో చూడాలి.
[youtube_video videoid=NjJoB75ksrY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: