ఓజీ సెకండ్ సింగిల్ రానుంది

OG Second Single on the Way

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రోమ్ రిలీజై ఆ హైప్ ను మరింతగా పెంచేసింది.ఇక ఓజీ సెకండ్ సింగిల్ కూడా రానుంది. ఈపాటను వచ్చే వారం రిలీజ్ చేయనున్నారు.వినాయక చవితి సందర్భంగా ఈనెల 27న విడుదల చేయనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో శ్రీయా రెడ్డి ,అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 25న ఓజీ పాన్ ఇండియా భాషల్లో థియేటర్లోకి రానుంది.హిట్ టాక్ వస్తే ఓజీ కలెక్షన్ల వర్షం కురిపించనుంది.ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా సోలోగా రిలీజయ్యే అవకాశాలు వున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ఫెడరేషన్ స్ట్రైక్ వల్ల షూటింగ్ కి బ్రేక్ పడింది. లేకపోతే ఈపాటికే పవన్ ఈసినిమాను పూర్తి చేసేవాడు.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రాశి ఖన్నా ,శ్రీ లీల హీరోయిన్లు గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.