తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయకులైన మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే అద్భుతంగా అనిపిస్తోంది కదూ.. ఇరువురి అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం ఈ స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడాలని కోరుకుంటారంటే అతిశయోక్తికాదు. వెండితెరపై వీరిద్దరినీ కలిపి చూడాలని మూవీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో, ఒకవేళ అలాంటి అవకాశం వస్తే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా తాను దర్శకత్వం వహించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి దీనిపై స్పందిస్తూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
“చిరంజీవి గారు గతంలోనే బాలకృష్ణ గారితో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ మంచి కథ దొరికితే కలిసి సినిమా చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ మంచి కథ దొరకాలి. ఎందుకంటే ఇద్దరు అగ్ర నటులైన చిరంజీవి మరియు బాలకృష్ణలకు వేర్వేరు మానేరిజంలు ఉంటాయి. అది ప్రేక్షకులు ఆశించే విధంగా ఉండాలి,” అని అనిల్ రావిపూడి అన్నారు.
“వారితో సినిమా చేయాలంటే కథ చాలా బలంగా ఉండాలి. ఒకవేళ ఇద్దరికీ సూట్ అయ్యే కథ దొరికితే ఖచ్చితంగా ఆ మల్టీస్టారర్‌ను డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను,” అని ఆయన తెలిపారు. ఈ సమాధానం మెగా, నందమూరి అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రెండు పెద్ద ఫ్యామిలీల అభిమానులు ఈ వార్తపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ రెండు ఫ్యామిలీల నుండి ఇంతకుముందు రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే చరణ్ తండ్రి చిరంజీవి, ఎన్టీఆర్ బాబాయి బాలకృష్ణ కలిసి నటిస్తే ఏ రేంజ్ హిట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక వీరిద్దరి స్టార్ ఇమేజ్‌కి తగ్గ కథ, వీరిని బిగ్ స్క్రీన్ పైన చూపించగలిగే దర్శకుడు ఎవరనేది కూడా అభిమానుల్లో చర్చనీయాంశం అవుతోంది. త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరుతుందని ఆశిద్దాం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























