విజయ్ సేతుపతి ,నిత్యా మేనన్ జంటగా తమిళం లో తెరకెక్కిన సినిమా తలైవన్ తలైవి. గత నెలలో విడుదలైన ఈసినిమా తమిళనాడులో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకొంది.దాదాపు 60 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక తమిళ్ లో భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తరువాత ఈసినిమాను తెలుగులో సార్ మేడమ్ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తెలుగులో మాత్రం అదే ఫలితాన్ని రిపీట్ చేయలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈరోజు నుండి ఈసినిమాను అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాండిరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాలో యోగిబాబు , రోషిని , కాళీ వెంకట్ కీలక పాత్రల్లో నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈసినిమాను నిర్మించారు.
ఇక ఇదిలావుంటే విజయ్ సేతుపతి ప్రస్తుతం హీరోగా తెలుగులో సినిమా చేస్తున్నాడు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా టబు కీలక పాత్రలో నటిస్తుంది. ఛార్మి తో కలిసి పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో రానున్న ఈసినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలో వుంది.వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































